ఏపీలో మోగిన మున్సిపల్ నగారా

118
AP Local Body Elections
AP Local Body Elections

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఏపీలో మరో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అదే నెల 14 ఓట్ల లెక్కింపు జరగనుంది. గతేడాది ఆగిన చోట నుంచే ఈ ప్రక్రియను తిరిగి మొదలుపెట్టనున్నట్టు ఎస్ఈసీ స్పష్టంచేసింది. నిజానికి గతేడాది మార్చి 23న మున్సిపల్ ఎన్నికలు జరగాలి. అయితే, కరోనా కారణంగా వాటిని అదే నెల 15న వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టింది. అయితే, సుప్రీంకోర్టు కూడా ఎస్ఈసీ నిర్ణయం సరైనదే అనడంతో ఎన్నికలు ఆగిపోయాయి. తాజాగా వాటికి రీ నోటిఫికేసన్ ఇస్తూ ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here