బిజెపిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు బ్రేక్

Spread the love

Secret behind Rajagopal Reddy not Joining BJP

కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసి బీజేపీలో చేరటానికి సిద్ధం అయిన రాజగోపాల్ రెడ్డి కి బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. బిజెపిలో చేరాలనే తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. తాము స్పష్టత ఇచ్చే వరకు కాంగ్రెసుకు రాజీనామా చేయవద్దని బిజెపి అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సూచించిందని సమాచారం . కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆయన చేరికకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే, వారి నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. దానికి ప్రధాన కారణం వారిద్దరి అభ్యంతరమేనని అంటున్నారు.

బిజెపిలోకి వెళ్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయం బయటకు వచ్చింది. దాంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై బిజెపి రాష్ట్ర నాయకులు తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నట్లు సమాచారం. ఆయన దూకుడు పార్టీకి నష్టం చేస్తుందని వారు అధిష్టానంతో చెప్పినట్లు సమాచారం.అందుకు అనుగుణంగా రాజగోపాల్ రెడ్డి డిమాండ్లు కూడా ఉన్నాయని అంటున్నారు. పార్టీ పగ్గాలను తన చేతికి ఇవ్వాలని ఆయన బిజెపి నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అది బిజెపి నాయకత్వానికి మింగుడు పడడం లేదని అంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *