మెగాస్టార్ నుంచి మినీ స్టార్ కు…

Surender Reddy’s next with Varun Tej

టైమ్ బ్యాడ్ అయినప్పుడు అంతే. మెగాస్టార్స్ తో సినిమాలు చేసినా.. మరో ఆఫర్ లేక మనీ స్టార్ కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మెగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అంతే అయింది. మెగా క్యాంప్ లో అల్లు అర్జున్ కు, రేసుగుర్రం, రామ్ చరణ్ కు ధృవ, మెగాస్టార్ కు కలల ప్రాజెక్ట్ అయిన సైరా వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి అనూహ్యంగా ఖాళీ అయిపోయాడు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ కు కథ వినిపించినా ఫైనల్ కాలేదు. ఇటు ఏ స్టార్ హీరో కూడా ఇప్పుడు ఖాళీగా లేడు. సో ఎలా చూసినా అతను మరో ఆరు నెలల పాటు సినిమా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికైనా స్టార్ హీరోలు అవకాశం ఇస్తారనే గ్యారెంటీ లేదు. అందుకే మెగా క్యాంప్ లోనే మరో మినీ హీరోతో అడ్జెస్ట్ అవ్వాలనుకుంటున్నాడట.

మెగా క్యాంప్ లో డిఫరెంట్ స్టోరీస్ తో ఆకట్టుకుంటోన్న వరుణ్ తేజ్ ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. యస్.. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అతను సురేందర్ రెడ్డితోనే వెళతాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కూడా కాస్త హై ఓల్టేజ్ గానే ఉంటుందట. అందుకే కథ విషయంలో పక్కాగా ఉంటున్నాడు సరేందర్. అటు వరుణ్ కూడా స్క్రిప్ట్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి.. మెగా క్యాంప్ లోని ఈ మినీ స్టార్ కు కూడా సురేందర్ రెడ్డి ఓ మెమరబుల్ హిట్ ఇస్తాడనుకోవచ్చు.

Surender Reddy’s next with Varun Tej,Varun Tej New Movie With Surender Reddy,Surender Reddy & Varun Tej’s movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *