రజనీకాంత్ కు సిఎం శుభాకాంక్షలు

13

Kcr Congratulated Rajnikanth

చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను, అశేష ప్రజాదరణ పొందిన దక్షిణాది తమిళ ప్రముఖ నటుడు రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. నటుడుగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం అని సిఎం అన్నారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సినీ హీరో రజనీకాంత్ కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.