రైళ్లు లేక ప్రయాణికుల పాట్లు

101
Visakha Railway Zone Processing Delay
Visakha Railway Zone Processing Delay

దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుండటం.. వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో దాదాపు అన్నింటా ఆంక్షలు తొలగిపోయాయి. బస్సులు, విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి. కానీ రైళ్లు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో తిరగడంలేదు. కేవలం ఎక్స్ ప్రెస్, ప్రీమియం కేటగిరీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. వాటిలో రిజర్వేషన్ ఉంటేనే ప్రయాణం సాధ్యమవుతుంది. దీంతో రైళ్ల మీదే ఆధారపడిన లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వలస కూలీల వంటివారు ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించి బస్సుల్లో వెళ్లలేక సతమతమవుతున్నారు. తమ బాధలు అర్థం చేసుకుని వెంటనే సాధారణ ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here