వ్యాపారిని ఇంటికి పిలిచి.. మత్తు మందిచ్చి..

12

ఓ వ్యాపారిని ఇంటికి పిలిచిన మహిళ.. అతడికి మత్తు మందిచ్చి నగ్న వీడియోలు తీసింది. ఆ సీడీ కావాలంటే రూ.30 లక్షలు ఇవ్వాల్సిందే అని బెదిరించింది. కర్ణాటకలోని హోస్పేటలో ఈ సంఘటన జరిగింది. కొప్పల్ లో స్టీల్ కంపెనీ ఉన్న ఓ వ్యాపారవేత్త హోస్పేటలోని ఎంజే నగర్ 6వ క్రాస్ లో ఆఫీసు పెట్టుకున్నారు. దాని ఎదురుగా నివాసం ఉంటున్న గీత అనే మహిళ.. ఆయన దగ్గర నుంచి డబ్బులు లాగాలని భావించింది. అనంతరం వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకుంది.

ఓ రోజు తన ఇంటికి ఆహ్వానించి టీ ఇచ్చింది. అది తాగిన ఆయన నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం కుమారుడి సహాయంతో అతడి నగ్న వీడియోలు చిత్రీకరించింది. రెండు రోజుల తర్వాత ఆయనకు ఫోన్ చేసి, నగ్న వీడియోలున్న సంగతి చెప్పింది. రూ.30 లక్షలు ఇచ్చి సీడీ తీసుకెళ్లాలని పేర్కొంది. దీంతో బెంబేలెత్తిన వ్యాపారవేత్త.. గీత బ్యాంకు అకౌంట్ కు రూ.15 లక్షలు బదిలీ చేశాడు. మిగిలిన డబ్బు కోసం ఓత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు గీతను, ఆమె కుమారుడిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here