05-05-5019 నుండి 11-05-2019 వరకు వారఫలాలు

Spread the love

05.05.20190 to 11.05.2019 Panchangam

మేషరాశి : ఈవారం సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాలకు అలాగే వివాదాలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట అలాగే వేచిచూసే ధోరణి తప్పక మేలుచేస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. నూతన ఉద్యోగప్రయత్నాలు వారంచివరలో ముందుకు సాగుతాయి. కుటుంబంలో మీ స్థాయి లేదా హోదా పెరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో మాత్రం ఎదో తెలియని ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. దైవకార్యక్రమాలకు సమయం ఇవ్వండి.  

వృషభరాశి :ఈవారం సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం వారం చివరలో చేతికి అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు అలాగే నిర్ణయాలకు అవకాశం కలదు. చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం, సమయానికి తగిన నిద్ర భోజనం మంచిది, అశ్రద్ద చేయకండి. 

 

మిథునరాశి: ఈవారం మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆశించిన మేర పెద్దలనుండి సహకారం లభిస్తుంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్స్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి లేక మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. కుటుంబంలో అందరి మధ్య ఉన్న మనస్పర్థలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవడం మంచిది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.  

కర్కాటకరాశి : ఈవారం ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మీ మొండితనం నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం కలదు, కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. 
 

సింహరాశి :ఈవారం అధికారులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. నూతన ప్రయత్నాల విషయంలో స్పష్టత అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవడం సూచన, కొనుగోలు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచనలు చేయుట మంచిది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో చర్చలు పెద్దగా ఆశించిన మేర ఫలితాలు ఇవ్వకపోవచ్చును. రుణపరమైన విషయాల్లో మాత్రం కాస్త మీ స్థాయి దాటి వెళ్ళకపోవడం సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. 

 

కన్యారాశి :ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. చర్చాపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవరించుట సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల్లో మీ ఆలోచనలు తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగర్తలు తీసుకోండి. వ్యాపార పరమైన విషయాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. సోదరుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. 

 
 

తులారాశి:ఈవారం కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విద్యా అవకాశాలు లభించే ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.  

 
వృశ్చికరాశి :ఈవారం మిత్రులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాలలో ఉన్న బంధువుల నుండి మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చిన వాటినుండి కోలుకుంటారు. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, ఆశించిన మేర ఆత్మీయుల నుండి సహకారం లభిస్తుంది.  
 

ధనస్సురాశి:ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి, నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండుట సూచన. కుటుంబంలో పెద్దల అభిప్రాయాలను తెలుసుకుంటారు. విలువైన వస్తువులను బహుమతులుగా పొందుటకు అవకాశం కలదు. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడం వలన మేలుజరుగుతుంది. 

 

మకరరాశి :ఈవారం పెద్దలను కలుస్తారు, మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన నష్టపోయే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు ఆస్కారం ఉంది, మీరు అధిక సమయం ఇస్తారు. 

 
కుంభరాశి :ఈవారం ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన సంగంలో మంచిపేరును పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. రుణపరమైన విషయాలలో కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వారం చివరలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది.
 

మీనరాశి :ఈవారం సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి, ఉన్నతమైన అవకాశాల కోసం కాస్త గట్టిగా ప్రయత్నం చేయుట మంచిది. కుటుంబంలో సభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో కలిసి నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వారం చివరలో మానసికంగా ఇబ్బందిని పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో వేచిచూసే ధోరణి మంచిది. 

 
 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *