1.22 లక్షల వలస కార్మికుల తరలింపు

1.22 lakhs migrant labor

తెలంగాణ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు 1.22 లక్షల వలస కార్మికులను 88 ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రైల్వేస్టేషన్ల నుండి వారి స్వరాష్ట్రాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద వలస కార్మికుల ప్రత్యేక రైలు ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు నాంపల్లి రైల్వేస్టేషన్ నుండి 6 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయని, మరో 40 రైళ్లు వివిధ రైల్వేస్టేషన్ల నుండి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్ల ద్వారా దాదాపు 50 వేలు వలస కార్మికులను వివిధ ప్రాంతాలకు రవాణా చేయనున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు రైల్వే వారు ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికునికి రెండు ఆహార పొట్లాలు, 3 లీటర్ల త్రాగు నీరు, పండ్లను అందిస్తున్నదన్నారు.

*  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సమర్దవంతంగా సమన్వయంతో మానిటరింగ్ చేసి కృషి చేసినందుకు పోలీస్ అధికారులను ఇతర శాఖల అధికారులు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిష్టర్ అయిన వలస కార్మికులందరిని ఈ రోజు తో వారి స్వరాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు. వీరిలో చాలా మంది తెలంగాణకు తిరిగి రావటానికి సుముఖంగా వున్నట్లు కార్మికులు తెలిపారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునఃనిర్మాణం లో వలస కార్మికులు ఒక భాగం అని తెలిపారు. ఆపదలో ఉన్న వలస కార్మికులందరు సురక్షితంగా వారి సొంత పట్టణాలకు గౌరవప్రదంగా పంపించడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఆదనపు డి.జి. (L&O) జితేందర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా జాయిట్ కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

TelanganaLiveNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *