1.50 LAKHS IT JOBS LOST
ఇండియన్ ఐటి సెక్టార్ పరిస్ధితి దారుణంగానే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నవారిలో చాలా మంది ఉద్యోగాలకు ఇపుడు గ్యారంటీ లేని పరిస్తితి నెలకొంది. కోవిడ్ దెబ్బకు లక్షా 50 వేల ఐటి ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని ఐటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో దాదాపుగా 50 లక్షల వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో టాప్ 5 కంపెనీల్లోనే దాదాపుగా 10 లక్షల మంది పనిచేస్తున్నారు. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో మరొకటి ఏవియేషన్ రంగం జీడీపీ కంట్రిబ్యూషన్‌లో 72 బిలియన్ డాలర్లు ఈ రంగం నుంచే వస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్ల నష్టాలు మూటకట్టుకుంటుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ -IATA చెపుతోంది.
* చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో దాదాపుగా 90శాతం పరిశ్రమలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వీటిపైన వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అసంగటిత రంగంలోని ప్రజలను కార్మికులను ఆకలి చావులు నుంచి కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు 38 కోట్ల జన్‌ధన్ ఖాతాలలో డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక్కో అకౌంట్‌కి 5 వేల రూపాయల చొప్పున వేయాలని ఆర్ధిక రంగ నిపుణులు సూచిసున్నారు. చిన్న తరహా పరిశ్రమలకు, ఎంటర్ ప్రైజెస్‌కు , టెక్స్టైల్ దుకాణాలకు ౩ నుంచి 4 నెలల పాటు పూర్తిగా వడ్డీ మినహాయింపులు చేయాల్సి ఉంటుంది. ఆర్బిఐ , బ్యాంకులు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వాలి అందుకు లెండింగ్ రేటు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది.
* ఇప్పటికే అభివృద్ధిచెందిన అమెరికా లాంటి దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు 2 లక్షల కోట్ల డాలర్లు అంటే తన జిడిపిలో దాదాపుగా 10 శాతం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కింద ప్రకటించింది. జపాన్ సైతం లక్ష కోట్ల డాలర్లు అంటే తన జిడిపిలో 20 శాతం ప్రత్యేక ప్యాకేజి కింద ప్రకటించాయి. ఫ్రాన్స్ సైతం ఇప్పటికే కరోనా ఫైట్‌కు సంబంధించి ఎకానమికి బూస్ట్ ఇవ్వడానికి దాదాపుగా 45 బిలియన్ యూరోలు ప్రకటించింది. అంటే దాదాపుగా ఆదేశ జిడిపిలో 5శాతం అన్నమాట.ఇక అత్యధికంగా కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన ఇటలీ సైతం దేశ ఆర్దికాభివృద్ధికి కోసం 25 బిలియన్ యూరోలు ప్రకటించింది. బ్రిటన్ సైతం 5 శాతం జిడిపిని ప్రత్యేక ప్యాకేజి కింద ప్రకటించింది. అంటే దాదాపుగా ౩౦లక్షల కోట్లు. జపాన్ సైతం ఆ దేశ జీడీపీలో 20 శాతానికి సమానమైన 75 లక్షల కోట్లు పన్ను ప్రోత్సహాకాలు, వడ్డీ లేని రుణాలు ప్రకటించింది. ఐతే భారత్మాత్రం కేవలం లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. అదీ భారత జీడీపీలో 0.6 శాతం మాత్రమే. కారణం భారత ప్రభుత్వం దగ్గర అనుకున్న విధంగా నిధులు లేకపోవడమే ప్రధాన కారణం.
2019-20కి సంబంధించి భారత ప్రభుత్వం జీఎస్టీ ద్వారా దాదాపుగా 7.4లక్షల కోట్ల రెవిన్యూ వసూళ్ళు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో 5.8 లక్షల కోట్లు వసూళ్లు చేసింది. 1.6 లక్షల కోట్ల వసూళ్ళు మేర ఆదాయం తగ్గింది. దీన్ని బట్టి ప్రస్తుతం ఇండియా భారీ స్ధాయిలో ఖర్చుపెట్టే స్ధాయిలో లేదు. ఇక రిజర్వ్ బ్యాంక్ వద్ద అత్యవసర పరిస్ధితుల్లో డ్రా చేసుకునే విధంగా ఉండే నిధులు ఇప్పటికే ప్రభుత్వం డ్రా చేసుకోగా, బ్యాంకుల వద్ద కేవలం 9.2 లక్షల కోట్లు మాత్రమే మిగిలాయి. దీంతో దేశ ఆర్దిక వ్యవస్త పూర్తి అగమ్యగోచరంగా మారింది. మరి ఇలాంటి పరిస్ధితుల్లో దేశ ఆర్ధిక పరిస్దితి ఎలా పునరుద్దరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.