పబ్జీ ఆట ఆడుతూ పదోతరగతి బాలుడు మిస్సింగ్

Spread the love

10 TH CLASS STUDENT MISSING WHILE PLAYING PUBG GAME

ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీ గేమ్ యువత భవిత పాడు చేస్తుంది. ఈ గేమ్ కు సంబంధించి రోజుకో కథనం వినబడుతోంది. వరుసగా రోజు ఎక్కడో ఒక చోట దారుణ సంఘటనలు జరుగుతున్నా పబ్జీ మీద ఉన్న క్రేజ్ యువతలో ఏ మాత్రం తగ్గడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా మైమరచిపోతూ దీన్ని ఆడేస్తున్నారు. దిల్లీలోని ఘజియాబాద్‌ పటేల్‌ నగర్‌లో ఇటీవల ఇలా పబ్‌జీ ఆడుకుంటూ ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను ఎక్కడికి వెళ్లాడు అనేది ఇంతవరకు తెలియలేదు. దీంతో అతని తండ్రి రాజేశ్‌ జయంత్‌ పోలీసులను ఆశ్రయించారు. పదో తరగతి చదువుతున్న తన కుమారుడు అభినవ్‌ (15) అదృశ్యమయ్యాడని, వారం రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు.
పబ్జీ ఆట వల్లే తమ కుమారుడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడని వారంటున్నారు. పబ్జీ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి తమ అబ్బాయి ఆలోచనల్లో మార్పు వచ్చిందని, ఈ ఆటను నిషేధించాలని ఆయన కోరుతున్నారు. పోలీసులు ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే మానసిక నిపుణులు సైతం ఈ ఆన్ లైన్ గేమింగ్ పబ్జీ ఆట ఓ వ్యసనంగా మారుతోందని చెప్తున్నారు.
పబ్జీ ఆటపై ప్రస్తుతం గుజరాత్‌లో నిషేధం కొనసాగుతోంది. అక్కడ పబ్‌జీ ఆడుతూ కనిపించిన చాలా మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుజరాత్ గానే కాకుండా, దేశవ్యాప్తంగా పబ్జీ ఆట పై నిషేధం విధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే మానసిక నిపుణులు పిల్లలకు వ్యసనంగా మారిన తర్వాత కాకుండా ఆదిలోనే పిల్లలు ఈ గేమ్ కు అలవాటు పడకుండా జాగ్రత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *