జనసేన పార్టీ కోసం 100 కోట్ల విరాళం

100 Crores Fund Collection For Janasena Party

జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే జనసేన కార్యకర్తలు 100 కోట్ల ఫండ్ సేకరించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ 48వ పుట్టినరోజు సందర్భంగా పవన్ ఫాన్స్ మరియు జనసేన కార్యకర్తలు పార్టీ కోసం 100 కోట్ల ఫండ్ ఇవ్వాలని నిర్ణయించడం ఆశ్చర్యానికి గురి చేసిందని నా ఛానల్ నా ఇష్టం ద్వారా మెగా బ్రదర్ నాగబాబు తెలియజేశారు. జనసేన నాయకులు, మద్దతుదారులు మరియు అభిమానులు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఆయన పుట్టినరోజుకు పార్టీ కోసం ఇస్తున్న ఫండ్ చాలా చిరస్మరణీయమని పేర్కొన్నారు నాగబాబు.
అయితే పవన్ కళ్యాణ్ పార్టీ కోసం 100 కోట్ల ఫండ్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున పెద్ద ఎత్తున విరాళాలు పవన్ పార్టీ కోసం ఇస్తున్నారు అభిమానులు. అయితే ఈ 100 కోట్ల పార్టీ ఫండ్ విషయంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు ఈ తరహా విరాళాలు వసూలు చేయడానికి పూనుకోలేదని, ఇప్పుడు జనసేన పార్టీ కోసం విరాళాలు వసూలు చేయడం వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉందని భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం కోసం ఇలా పార్టీ ఫండ్ పేరుతో పార్టీ నాయకులే తెర తీశారని ఒక వాదన వినిపిస్తుంది. అలాగే జనసేన పార్టీకి పార్టీని.. అభిమానులను అడ్డం పెట్టుకుని పార్టీ నాయకులు ఆడుతున్న నాటకమని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీ ఫండ్ పేరుతో సేకరిస్తున్న విరాళాలను, అభిమానులు జనసైనికులు దుర్వినియోగం చేస్తారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తం పార్టీ ఫండ్ సేకరణ తర్వాత ఎంత మొత్తం పార్టీకోసం ఫండ్ సేకరించారో జనసేన ను ప్రకటిస్తారా అన్నది కూడా ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేసినట్లుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 100 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం అని చెప్పాలి.

India Series Against Windies

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *