ఒక్క రోజే 170మంది మృతి

107 Died In A Single Day

దేశంలో కరోన బాధితుల సంఖ్య 1, 51, 767 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 83, 004 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోన నుండి ఇప్పటి వరకు 64, 425 మంది బాధితులు కోలుకున్నారు. మన దేశంలో కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 4, 337 మంది మృతి చెందారు. అదే అగ్రరాజ్యమైన అమెరికా కరోనా మరణాల్లోనూ అగ్రస్థానంలోనే ఉన్నది. అక్కడ కరోనా వల్ల మరణించినవారి సంఖ్య లక్ష దాటేసింది. మన దేశంలో రోజురోజుకీ కరోనా పెరుగుతున్నది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 6,387 పాజిటివ్ కేసులు నమోదు కాగా 170మంది మృతి చెందారు. కాకపోతే, నిన్న ఒక్కరోజే 3,935 మంది బాధితులు కోలుకున్నారు.

 

#coronaindiaupdates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *