118 Moview Review & Rating

118 Moview Review & Rating
బ్యాన‌ర్ :  ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, షాలిని పాండే,  నివేదా థామ‌స్, నాజ‌ర్‌, రాజీవ్ క‌న‌కాల, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, ప్ర‌భాస్ శ్రీను, అశోక్ కుమార్‌, త‌దిత‌రులు
ఫైట్స్‌: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌,
డైలాగ్స్‌:  మిర్చి కిర‌ణ్‌
మ్యూజిక్:  శేఖ‌ర్ చంద్ర‌
ఎడిటింగ్‌: తమ్మిరాజు
నిర్మాత‌:  మ‌హేష్ కొనేరు
క‌థ‌, ఛాయాగ్ర‌హ‌ణం, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం:  కె.వి.గుహ‌న్‌
16 ఏళ్ల కెరీర్‌లో 20 సినిమాలు కూడా చేయ‌ని హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌.. అయితే సినిమా కోసం అత‌ను నిజాయ‌తీగా చేసే ప్ర‌య‌త్నం, కొత్త ద‌ర్శ‌కుల‌ను అత‌ను ఎంక‌రేజ్ చేసే తీరు బావుంటుంది. వీలైనంత మేర కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తుంటాడు. ఈ శుక్ర‌వారం నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ `118`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ డైరెక్ట్ చేసిన తొలి చిత్ర‌మిది. స‌స్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆకట్టుకుంది. క‌ల్యాణ్ రామ్‌కు సక్సెస్ ఇస్తుందా?  డైరెక్ట‌ర్‌గా కె.వి.గుహ‌న్ ప‌నితీరు ఎలా ఉంది? ఆయ‌న ఏ మేర స‌క్సెస్ సాధించారు?  త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకునే ముందు క‌థేంటో చూద్దాం..
క‌థ‌
గౌత‌మ్ (క‌ల్యాణ్ రామ్‌), మేఘ (షాలినీ పాండే) ఒక‌రినొక‌రు ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్లిద్ద‌రికీ పెళ్లి కుదిరి ఉంటుంది. ఓ వైపు పెళ్లి ప‌నుల్లో ఉన్న గౌత‌మ్‌కి ఒకే క‌ల రెండు సార్లు వ‌స్తుంది. అందులో ఓ అమ్మాయిని దారుణంగా హింసిస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఆమె ఎవ‌రు? ఆ క‌ల అత‌నికి ఎందుకు వ‌స్తుంది? ఆ క‌ల‌ను వెతుక్కుంటూ వెళ్లిన అత‌నికి నిజ జీవితంలో అది జ‌రిగింద‌న్న విష‌యం క్ర‌మంగా అర్థం కాసాగుతుంది. త‌నకు క‌ల‌లో క‌నిపించిన అమ్మాయి పేరు ఎస్త‌ర్ అని తెలుసుకుంటాడు. అయితే ఎస్త‌ర్ కాద‌ని, తాను వెతుకుతున్న‌ది ఆద్య‌కోస‌మని తెలుస్తుంది. ఇంత‌కీ ఆద్యకు, గౌత‌మ్‌కి సంబంధం ఏంటి? ఆద్య గురించి తెలుసుకున్న మేఘ ఎలా స్పందించింది? ఆద్య‌కు వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి?  దాన్ని గౌత‌మ్ ప‌రిష్క‌రించాడా?  లేదా?  అనేది ఆస‌క్తిక‌రం.
స‌మీక్ష‌
ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా క‌ల్యాణ్‌రామ్ న‌టించ‌డం ఇది తొలిసారి కాదు. ఇది రెండో సారి. ఈ సినిమాలోనూ అత‌ను ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా న‌టించాడు. అయితే ఇందులో త‌న క‌ల‌ను వెతుక్కుంటూ ముందుకు సాగే జ‌ర్న‌లిస్టుగా న‌టించారు. అత‌న్ని అర్థం చేసుకున్న ప్రేయ‌సి పాత్ర‌లో షాలినీ పాండే చ‌క్క‌గా న‌టించారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఆమె న‌ట‌న‌కు ఇందులో పెద్ద‌గా స్కోప్ లేదు. చ‌మ్మ‌క్ చంద్ర‌, ప్ర‌భాస్ శీను ఉన్నప్ప‌టికీ సినిమాలో ఎక్క‌డా కామెడీకి స్కోప్ లేదు. క‌ల్యాణ్‌రామ్ ముఖంలో క‌నిపించిన సీరియ‌స్‌నెస్ ఆయ‌న గొంతులో వినిపించ‌దు. మాట తేలిపోతున్న‌ట్టు అనిపించింది. ఆయ‌న మేక‌ప్ కూడా మెప్పించే విధంగా లేదు. అత‌నికే కాదు, సినిమాలో చాలా మంది ఆర్టిస్టుల‌కు మేక‌ప్ స‌రిగా లేదు. నివేదా తొలిసారి డ‌బ్బింగ్ చెప్పినా, చ‌క్క‌గా చెప్పింది. స‌న్నివేశాల్లో ప్రేక్ష‌కుల‌ను క‌న్‌ఫ్యూజ్  చేద్దామ‌ని ప్ర‌య‌త్నించారు ద‌ర్శ‌కుడు. అయితే ద‌ర్శ‌కుడే త‌డ‌బ‌డ్డ‌ట్టు అనిపించింది. ఇలాంటి సినిమాల‌కు స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉండాలి. అయితే ఇందులో కొర‌వ‌డింది కూడా అదే. కారుల ఛేజ్‌లు కూడా పెద్ద‌గా పండ‌లేదు. రీరికార్డంగ్ అక్క‌డ‌క్క‌డా బాగానే ఉన్నా, సినిమాకు పెద్ద‌గా ప్ల‌స్ అయింది కూడా ఏమీ లేదు. పాట విడిగా బాగా ఉన్నా, సినిమాలో ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో అర్థం కాన‌ట్టు ఉంటుంది. దర్శ‌కుడు ఓవ‌ర్‌గా డ్ర‌మ‌టైజ్ చేసిన అంశాల్లో కీల‌క‌మైంది కేవ‌లం ఆరు నెల‌లు, ఎనిమిది నెల‌లు మూసి ఉన్న ఇల్లు.. అంత బూజుప‌ట్టి పోవు. ఆర్ట్ డిపార్ట్ మెంట్ జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. స్టార్ట్ చేసిన ప‌నిని మ‌ధ్య‌లో ఆప‌డం నాకు చిరాకు అనే డైలాగ్ త‌ప్పితే, మ‌ళ్లీ మ‌ళ్లీ అనుకోద‌గ్గ గుర్తుచేసుకోద‌గ్గ డైలాగు అస‌లు లేదు. సెకండాఫ్‌ని ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఎడిట్ చేసి ఉంటే బావుండేదేమో.
బాట‌మ్ లైన్ : 118… ఎదురుచూసినంత గొప్ప‌గా లేదు
రేటింగ్‌: 2/5

For more Interesting Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *