నిందితులకు 14 రోజుల రిమాండ్

14 Days Remand to Accused

ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన  తహసీల్దార్ పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని పోలీసులు భావించారు. దీంతో, మేజిస్ట్రేట్ ను పోలీస్ స్టేషన్ కే తీసుకొచ్చారు.కేసును విచారించిన మేజిస్ట్రేట్ నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. నిందితులకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, వారిని మహబూబ్ నగర్ జిల్లా జైలుకు గానీ , చంచల్ గూడా జైలుకు గానీ  పోలీసులు తరలించనున్నారు. ఏ జైలుకు తరలిస్తారు అన్నదానిపై గోప్యత పాటిస్తున్నారు పోలీసులు .

తెలంగాణ రాష్ట్రంలో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. మరో అమాయకురాలు కామాంధుల పైశాచికత్వం బలైపోయింది. ఊహించని విధంగా నలుగురు రాక్షసులు మూకుమ్మడి దాడి చేస్తే కాపాడండి కాపాడండి అని అరచినా రక్షించ లేని సమాజం ముందు అచేతనంగా మిగిలిపోయింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి, నలుగురు మానవ మృగాలు అత్యాచారం చేసి, హతమార్చి ఆ తరువాత మృతదేహం పైన కూడా అఘాయిత్యాలకు పాల్పడ్డారు అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే క్రూరత్వం ఎక్కడ ఉండదు అని చెప్పక తప్పని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో దేశం మొత్తం స్పందించింది. ముక్తకంఠంతో నిందితులను శిక్షించాలని, మరణ శిక్ష విధించాలని నినదిస్తోంది.

14 Days Remand to Accused,Priyanka Reddy Murder Case,RIP Priyanka Reddy,Remand,ప్రియాంక రెడ్డి హత్య,Doctor Priyanka Reddy,fourteen days remand,Police to send 4 Accused

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *