రెండు నెలల్లో 15 లక్షలు వచ్చారా?

15 lakhs entered India

కరోనా చైనాలో పుట్టిన ఈ వైరస్ విదేశీయుల ద్వారా భారత్ లోకి ప్రవేశించింది. ఇక ఈ  వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించిన నేపధ్యంలో చాలా మంది అక్కడ నుండి ఇండియాకు వచ్చారు. వస్తూ వస్తూ కొందరు కరోనాను కూడా వెంట తెచ్చారు. ఇక  వ్యాప్తి విజృంభణ నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. గత రెండు నెలల్లో 15 లక్షల మందికి పైగా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఇండియాకు వచ్చారని, వారిని మానిటర్ చేయడంలో విరామం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన లేఖ రాస్తూ వీరిని ట్రాకింగ్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కరోనా అదుపునకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఇది తీవ్రమైన అవరోధం కావచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 క్రైసిస్ మేనేజిమెంట్ గ్రూఫునకు నేతృత్వం వహిస్తున్న ఈయనవిదేశాలనుంచి వఛ్చిన వారి విషయంలో ‘రాడార్’ కిందకు రానివారిని తక్షణమే సర్వేలెన్స్ నిఘాలో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగే ప్రయాణికుల స్క్రీనింగ్ పరీక్షలను జనవరి 18 నుంచి కేంద్రం ప్రారంభించిందని, ఈ నెల 23 వరకు ఎంతమంది వచ్చారని ఆరా తీయగా.. 15 లక్లల మందికి పైగా ఇక్కడికి చేరుకున్నట్టు ఇమ్మిగ్రేషన్ బ్యూరో తెలిపిందన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వెంటనే వీరి ట్రాకింగ్ కి చర్యలు చేపట్టాలని రాజీవ్ గాబా కోరారు.

tags: India Corona Virus, Corona Pandemic, Corona China, Corona India, Pm Modi, Narendra Modi, Foreigners, abroad travelers, rajeev gauba, raadar screening, immigration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *