విమానాల ద్వారా 1600 మంది

1600 passengers coming city

ఇతర రాష్ట్రాల నుంచి సోమవారం దాదాపు 1600 మంది హైదరాబాద్ వస్తున్నారని..  ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారన్ టైన్ లేదని.. ఇప్పుడు వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ 19 ఫ్లైట్ హైదరాబాద్ కు రావడం మరో 19 ఫ్లైట్స్ హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లడం జరుగుతుందన్నారు. ప్యాసింజర్ లేకుంటే మాత్రమే ఫ్లయిట్స్ క్యాన్సల్ అవుతున్నాయని తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకున్నామని, ప్యాసింజర్ ని టచ్ చేయకుండా సెన్సార్ లు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని,  ఇప్పటికి వరకు వచ్చిన వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

శంషాబాద్ విమానాశ్రయంలో సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఆరోగ్య సేతు యాప్ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి మరిన్ని విమాన సర్వీస్ లు పెరిగే అవకాశం దాని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విదేశీ విమాన సర్వీస్ టర్మీనల్ లను కూడా సందర్శించామని చెప్పారు. ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ వారి సూచించే సూచనలు సలహాలు ప్రతి ప్రయాణికుడు పాటించాలని కోరారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

HYDERABAD DOMESTIC PASSENGERS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *