తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు ఇచ్చి నిరసన

18 days completed tsrtc strike

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు 21వ తేదీ నుంచి పది రోజుల వరకు కార్యాచరణ ప్రకటించారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేలా షెడ్యూల్ విడుదల చేశారు. అందులోభాగంగా తమ పొట్ట కొట్టొద్దంటూ తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు ఇచ్చి నిరసన తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. చర్చల్లేవు అంటూ ప్రభుత్వం మొండికేయడంతో కార్మికులు నిరసనకు దిగుతున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సమ్మెలో భాగంగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదాలు జరిగి తోపులాటకు దారి తీస్తోంది. అయితే ప్రభుత్వం దిగి వచ్చేలా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ 21వ తేదీ నుంచి 30 వరకు వివిధ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 22వ తేదీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో కార్మికులు విజయవంతం చేశారు.  విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు అందించారు అక్కడి జేఏసీ నాయకులు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు ఇవ్వాలని.. తమ పొట్ట కొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. నిరసన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చని భావించిన నేపధ్యంలో బస్టాండ్‌లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
tags :tsrtc strike, rtc strike,  protest, rtc workers, temperory workers, representations, flowers, depots, bus stands, police

http://tsnews.tv/kalki-ashramam-it-raids/
http://tsnews.tv/kalki-aasram-issue/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *