ఇస్రోకు పదేళ్ళ బాలుడు రాసిన లేఖ వైరల్

1o years kid wrote a letter to ISRO is viral

చంద్రయాన్ 2 ప్రయోగం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది . ఈ ప్రయోగానికి సంబంధించిన సక్సెస్ రేటు 95 శాతం వరకూ ఉందన్న మాటను నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అనుకున్న రీతిలో విక్రమ్ ల్యాండర్ అనుకున్న రీతిలో చంద్రుడి మీదకు దిగకపోవటంతో అసలేం జరిగిందో కనిపెట్టే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు .
చంద్రయాన్ 2 ప్రయోగం పక్కా సక్సెస్ అని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు. అయితే.. వారిలో స్థైర్యం మిస్ కాకుండా ఉండేలా ప్రధాని మోడీ స్ఫూర్తివంతమైన ప్రసంగం చేసి.. వారిలో ఉత్తేజాన్ని నింపారు. దేశ ప్రజలు సైతం ఇస్రోకు అండగా నిలిచారు. వారు చేసిన అద్భుతమైన కృషికి దేశం నుంచి మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్ల పిల్లాడు ఇస్రోకు రాసిన ఒక లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆంజనేయ కౌల్ అనే పదేళ్ల పిల్లాడు ఇస్రోకు ఒక లేఖ రాశారు. అందులో ఏముందంటే.. అంత త్వరగా స్థైర్యాన్ని కోల్పోవద్దు.. మనం తప్పకుండా చంద్రుణ్ని చేరుతాం. వచ్చే జూన్ లో లాంచ్ చేయనున్న చంద్రయాన్ 3 మన లక్ష్యమని పేర్కొన్నాడు.అంతేకాదు.. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ ఇంకా చంద్ర కక్ష్యలోనే ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని.. అది మనకు ఫోటోల్ని పంపుతుందన్నాడు. మనం ఎక్కడికి వెళ్లాలో.. ఎక్కడ విత్తనాలు నాటి మొక్కలు పెంచాలో ఆర్బిటర్ చెబుతుందన్నాడు. విక్రమ్ ల్యాండయ్యే ఉంటుందని.. గ్రాఫికల్ బ్యాండ్స్ ను మనకు పంపించేందుకు సిద్ధమవుతూ ఉండి ఉంటుందన్నాడు ప్రజ్ఞాన్ .అదే జరిగితే విజయం మన చేతుల్లోనే ఉందని.. తదుపరి తరం పిల్లలకు ఇస్రో శాస్త్రవేత్తలే స్ఫూర్తిదాయకమన్న ఆ బాలుడు ఇస్రో.. నువ్వు మాకు గర్వకారణం.. దేశం తరఫున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్ అంటూ ముగించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *