జూబ్లీహిల్స్ పబ్ లో రేవ్ పార్టీ ..

20 women rescued from rave party in Jubilee Hills

హైదరాబాద్ కేంద్రంగా విచ్చలవిడిగా సాగుతున్న రేవ్ పార్టీల గుట్టు రట్టు చేశారు పోలీసులు . ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ పబ్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 22 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తను చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా  యువతులు దాడికి ప్రయత్నించారు. కెమెరాలను లాగేందుకు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడి చేశామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. మరో 5 నిమిషాల్లో పార్టీ మొదలవుతుందన్న సమయంలో తాము అక్కడి చేరుకున్నామన్నారు. నిర్వాహకుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
ఇక తాజాగా ఈ కేసు విచారిస్తున్న పోలీసులకు జూబ్లీహిల్స్‌ పబ్‌లో రేవ్‌ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సేల్స్‌ పెంచుకునేందుకు డాక్టర్లు, ఉద్యోగుల కోసం పబ్ ను సిగ్నోవా ఫార్మా కంపెనీ బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ప్రసాద్‌ ప్రతి ఏటా రేవ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ యువతులంతా నెల్లూరుకు చెందిన వారితో పాటు ముంబయి వారు కూడా ఉన్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాలు, ఈవెంట్స్‌లో డ్యాన్స్‌ చేసేందుకు వచ్చిన యువతులు వ్యభిచార రొంపిలోకి దిగి ఈ వ్యవహారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.గతంలో కూడా ఇప్పుడు ఈవెంట్ నిర్వహించిన ఆర్గనైజర్  ఇలాంటి పార్టీలు నిర్వహించినట్టు తెలుస్తుంది .

20 women rescued from rave party in Jubilee Hills,Hyderabad, jublee hills pub, banjara hills, police,  rave party , 22 girls,arrest ,  nude dances , prostitution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *