2019 బ‌డ్జెట్ ముఖ్యాంశాలు

Spread the love

2019 BUDGET HIGHLIGHTS,FINANCE MINISTER NIRMALA SEETARAMAN PRESENTED BUDGET IN LOKSABHA

స్వచ్ఛభారత్‌ అభిమాన్‌ పథకం విజయవంతమైంది. 9.6కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించాం.
​డిజిటల్‌ అంతరాలను తొలగించే డిజిటల్‌ లిటరసీ కార్యక్రమం. నగరాలు, పట్టణాలు, గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నాం.
​81లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథక కింద నిర్మించడం జరిగింది.
​అక్టోబరు 2నాటికి ఓడీఎఫ్‌ భారత్‌గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశం ఇచ్చే కానుక ఇదే.
​మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన.
​పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు రైతులకు ధన్యవాదాలు. రైతులు దిగుమతుల భారం తగ్గించాం.
​జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు.
​పరిశోధనలకు ప్రాధాన్యం. జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం.
ప్రపంచంలో టాప్‌-200 విద్యా సంస్థల్లో 30 భారత విద్యాసంస్థలు ఉన్నాయి.
​అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థలకు మరిన్ని నిధులు.
​స్టడీ ఇన్‌ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునే అవకాశం.
​ఖేల్‌ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం.
​బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం.
​నాలుగు కార్మిక న్యాయస్థానాల ఏర్పాటు.
​దూరదర్శన్‌లో స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా కొత్త ఛానల్‌.
​వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగింత.
​పీపీపీల పరంగా అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా ఉంది.
​స్టాండప్‌ ఇండియా పథకం ప్రకారం వెనుకబడిన వర్గాల యువతకు శిక్షణ.
​ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం.
​256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్‌.
​ప్రధానమంత్రి డిజిటల్‌ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ అందించాం.
​శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తున్నాం.
​గ్రామీణ భారత ప్రగతిలో మహిళ పాత్ర కీలకం. అన్ని చోట్లా మహిళా నాయకత్వం పెరుగుతోంది.
​2019 ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. 78మంది మహిళలు ఎన్నికల్లో విజయం సాధించారు.
​మహిళల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో పథకాలు.
​జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం.
​ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ. వీటి వాడకం వల్ల రూ.80వేల కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా.
​భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.
​పర్యాటక రంగాభివృద్ధికి 17 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ప్రత్యేకించి ఆదివాసీలకు సంబంధించిన నృత్య, కళా, సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్‌ చేయనున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *