జూన్ 9 నుంచి 15 దాకా వార‌ఫ‌లాలు

Spread the love

2019 June Second Week Horoscope

మేషరాశి: ఈవారం ఆరంభంలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది, పెద్దల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం సూచన. చర్చాపరమైన విషయాల్లో కాస్త సర్దుబాటు విధానం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానం విషయంలో నూతన నిర్ణయాలకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.

వృషభరాశి:ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. మానసికంగా ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును. బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రుణపరమైన విషయాల్లో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి.

మిథునరాశి: ఈవారం కుటుంబంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది, ఊహించని విధంగా మిత్రులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలకు ఆస్కారం ఉంది. నూతన భాగస్వామ్య ఒప్పందాలకు ఒక రూపం ఏర్పడుతుంది. చర్చల్లో సమయం గడుపుతారు. ఉద్యోగంలో మీరు చేసిన నూతన ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. నూతన వ్యవహారాల్లో సమయం గడుపుతారు. ఆత్మేయులను కలుసుకొని ప్రయత్నం మేలు చేస్తుంది.

కర్కాటకరాశి: ఈవారం సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న, చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ మాటతీరు చాలామందిని ఆకట్టుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు, తగ్గించుకొనే ప్రయత్నంలో ఇబ్బంది పడుతారు. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

సింహరాశి: ఈవారం కుటుంబపరమైన విషయంలో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచన కలిగి ఉంటారు, పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చర్చాపరమైన విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండుట సూచన.

కన్యారాశి: ఈవారం బంధువులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తిచేసులా ప్రణాళిక కలిగి ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయ. రుణపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. విలువైన వస్తువుల కోసం ధనం ఖర్చు పెడతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం, సూచన.

తులారాశి: ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగంలో తోటివారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రామ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సర్దుబాటు విధానం మంచిది. చర్చాపరమైన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట అలాగే అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తండ్రి తరుపు బంధువులను కలుస్తారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.

వృశ్చికరాశి: ఈవారం మిత్రులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాలకే మీరు ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట అలాగే సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన.

ధనస్సురాశి:ఈవారం ముఖ్యమైన ఆలోచనలు వాయిదా వేయుట సూచన. కొన్ని కొన్ని విషయాల్లో వేచిచూసే ధోరణి వలన తప్పక మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులను కలుస్తారు, వారితో కలిసి విందులు అలాగే వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. దైవపరమైన విషయాల్లో సమయం గడుఫుతారు. సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుతుంది, కొంత సమస్యలు తగ్గముఖం పడుతాయి. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశం వచ్చే అవకాశం ఉంది.

మకరరాశి: ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వద్దు, బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మానసికపరమైన ఆందోళన మిమ్మల్ని ఒకింత ఇబ్బందికి గురిచేస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. బంధువుల నుండి వచ్చే సూచలను పరిగణలోకి తీసుకోవడం మంచిది.దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది.

కుంభరాశి:ఈవారం సోదరులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో అనుకోని మార్పులకు అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాలకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండుట సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మీనరాశి :ఈవారం ఆరంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేయుట సూచన.విలువైన వస్తువులను నస్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ద వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. మీ మాటతీరు వివాదాలకు అవకాశం కాకుండా జాగ్రత్త పదండి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సోదరులతో చర్చలకు అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్త్తాయి.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *