ఆర్టీసీకి 21 విద్యుత్ సంఘాలు, హైకోర్టు అడ్వకేట్ల మద్దతు

21 power unions and high court advocates support RTC strike

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంతకంతకూ తీవ్రతరమవుతోంది. ఒక్కొక్కరుగా ఆర్తీసీకార్మికులకు మద్దతు అందిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సంఘాలు ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా, తెలంగాణ ట్రేడ్ యూనియన్ లో ఉన్న 21 విద్యుత్ సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. వారితో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీని నిర్వహించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అవుతున్నా ప్రభుత్వ తీరు మాత్రం దున్నపోతు మీద వాన కురిసిన చందంగా ఉంది . ఆర్టీసీ కార్మికుల సమస్యపై అవసరమైతే ఆమరణదీక్ష చేస్తామని , కార్మికుల డిమాండ్ కోసం ఉద్యమం చేస్తామని రాజకీయ పార్టీలు సైతం స్పష్టంగా చెప్తున్నాయి. .48 వేల మంది కార్మికులను తొలగిస్తామంటే  చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఆర్టీసీ కార్మికులను కాపాడుకుంటామన్నారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎర్రబెల్లి, తలసానికి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పక్కరాష్ట్ర సీఎం జగన్ చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని పలు రాజకీయ పార్టీల నేతలు చెప్పారు.
tags : TSRTC, RTC strike, telangana RTC news, RTC JAC, power trade unions, advocates, high court

17న హుజూర్ నగర్  లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ 

ఆర్టీసీ కార్మికులతో చర్చలకు వెళ్లాలని  హైకోర్టు ఆదేశం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *