భానుప్రియ ఇంట్లో మరో ముగ్గురు మైనర్లు

3 minor find in Banu Priya Home – కేసులో కీలక మలుపు …

తీగ లాగితే డొంకంతా కదులుతుంది. భానుప్రియ తమ కుమార్తెను పనిలో పెట్టుకుని వేధిస్తుందని చేసిన ఫిర్యాదు ఇప్పుడు భానుప్రియ మెడకు చుట్టుకుంటుంది. తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో నటించి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటి భానుప్రియ ఇంట్లో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది . చెన్నైలోని ఆమె నివాసంలో మరో ముగ్గురు మైనర్ బాలికలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఓ చిన్నారిని వేధిస్తుందంటూ కనీసం తల్లిని కూడా కలిసేందుకు వీలు కల్పించట్లేదంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆ బాలికదే తప్పుందంటూ పోలీసులు సైతం తల్లి, కూతురుని అరెస్టు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మైనర్ బాలికతో పని చేయించుకుంటుందని బాలల హక్కు సంఘం అధికారి అచ్యుతరావు.. భానుప్రియపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి)కి ఫిర్యాదు చేశారు. భానుప్రియను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.
దాంతో పాటుగా భానుప్రియ ఇంట్లో నలుగురు మైనర్ బాలికలు ఉన్నారని.. కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకోవాలని కోరారు. వారందరినీ సెక్స్ వర్క్‌లోకి దింపేందుకు నటి ప్రేరేపిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఒక మధ్య వ్యక్తిని పెట్టుకుని బాలికలను ఆంధ్ర నుంచి చెన్నైకు తీసుకుస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేర చెన్నైలోని టీ నగర్ నివాసంలో దాడులు చేసిన బాలల హక్కుల పరిరక్షణ సమితి అధికారులు ముగ్గురు మైనర్ బాలికలను గుర్తించారు.
అంతకు ముందు భానుప్రియ నివాసంలో తన కూతురు వేధింపులకు గురవుతోందని.. తల్లి సామర్లకోటలో కొద్ది రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో దొంగిలించిన వస్తువులు తిరిగి అడిగినందుకే కేసు పెట్టారని..ఏడాది నుండి బాలిక పద్మ పనిచేస్తోందని…డబ్బు..ఇతర వస్తువులు కనిపించకపోవడంతో బాలికను నిలదీయడం జరిగిందని…పోలీసులకు చెబుతామని హెచ్చరించడం జరిగిందన్నారు. చివరకు బాలిక తన తప్పును ఒప్పుకుందని చెప్పిన భానుప్రియ తమపై చేసిన ఫిర్యాదు తప్పని చెప్పారు. అయితే మైనర్ బాలికతో పని చేయించుకుంటున్న వ్యవహారం లో ఆమె ఇరుక్కుపోయారు. ఇప్పుడు మరో ముగ్గురు మైనర్ లను ఆమె ఇంట్లో అధికారులు గుర్తించటంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది.

Related posts:

ఐటీ మహిళకొచ్చిన కష్టం పగవాడికీ రావొద్దు
అలరించిన కుమారి రమ్యా భరతనాట్యం
వీడు తండ్రా? కాదు మానవమృగం..
తిరుమలలో కేసీఆర్ కి గ్రాండ్ వెల్కమ్
తొమ్మిదోతరగతి బాలిక అత్యాచారం
నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలట
పార్లమెంట్ ఎన్నికల బరిలో నేషనల్ ఉమెన్స్ పార్టీ
బలవంతంగా తాళి కట్టి ఆపై చిత్రహింసలు పెట్టిన ఘనుడు
మహిళలకు 33 శాతం సీట్లిస్తామని ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్ద పీట వేసిన తెలంగాణా సర్కార్
మహిళా ఉద్యోగులకు సెలవు
  మహిళా ఉద్యోగులపై రక్షణా శాఖ కీలక నిర్ణయం
శబరిమలలో మహిళల ప్రవేశంపై ట్రావెన్ కోర్ బోర్డు షాకింగ్ నిర్ణయం
మహిళా రిజర్వేషన్ బిల్లు మాటేంటి అంటున్న ఎంపీ కవిత
శబరిమల వివాదం స‌ద్దుమ‌ణిగేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *