ఆర్బీఐ గుడ్ డిసీషన్

3 MONTHS TIME TO REPAY LOANS

కరోనా బారిన పడటంతో ఇబ్బందులకు గురౌతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రివర్స్ రెపో రేటు 90 బేసిక్ పాయింట్లు, రెపో రేటు 75 బేసిక్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెపో రేటు 4.4 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్న ఆయన.. ఆర్ధిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ప్రతినెలా చెల్లించే అన్నిరకాల రుణాల చెల్లింపుల విషయంలోనూ ఆర్బీఐ శుభవార్త అందించింది. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల రుణాల మీద ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్బీఐ గవర్నర్ సూచించారు. రుణ చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు సహరిస్తామని చెప్పిన ఆయన.. ఆర్బీఐలో పని చేసే 150 మంది ఉద్యోగులు క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు.

 

RBI LATEST DECISION

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *