ఉద్యోగులకు 34% ఫిట్ మెంట్

5
34% Fitment to Employees
34% Fitment to Employees

34% Fitment to Employees

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులకు 34% ఫిట్ మెంట్ ప్రకటిస్తుందని.. 2018 జులై నుండి ఎరియర్స్ అందజేస్తుందనే వార్తలు వాట్సపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం.. కేంద్ర ఉద్యోగులతో సమంగా అలవెన్సులు తెలంగాణ ప్రభుత్వం అందించడానికి సమాయత్తం అవుతుందట. Cps ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అందజేస్తారని.. పదవీ విరమణ 60కి పెంచడంతో పాటు సాగర్ ఎన్నికలు ముగియగానే టెట్ లేకుండా డీయస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారట. పాత జోన్ల ప్రకారం గ్రూప్ 1,2,3 నోటిికేషన్ల విడుదల చేస్తారని నిరుద్యోగులకు భృతి పై అధ్యయనానికి కమిటీ వేస్తారని, దీనిపై సోమవారం సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ వార్తలో నిజమెంత ఉందో తెలుసుకోవాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే.

 

Telangana Live News