పాకిస్తాన్ లో బంధీలైన 34 మంది

34 Indian fishermen who were captured in Pakistan

భారతదేశానికి చెందిన జాలర్లు పాకిస్థాన్ కు చిక్కారు. అంతర్జాతీయ సరిహద్దు జలాలలను దాటి వెళ్లిన 34మంది భారత జాలర్లను పాకిస్థాన్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం వల్ల వారు పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారంటూ మంగళవారం మే 7న జాలర్లను అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.కాగా సాంకేతిక పరిజ్ఞానం లేని కారణంగా భారత్, పాకిస్తాన్ జాలర్లు తరచూ అరెస్టులకు గురవుతున్నారు.

జాలర్లకు సంబంధించిన ఆరు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని..వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించామని పాక్ తీరప్రాంత గస్తీ దళం ప్రతినిధి తెలిపారు.
అదుపులోకి తీసుకున్న భారత జాలర్లను జుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడమని..రిమాండ్‌కు అప్పగించాలా లేదా అన్నది మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారని తెలిపారు. కాగా జనవరిలో గుజరాత్‌కి చెందిన కొంతమంది జాలర్లను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ వారిని జైళ్లలో నిర్బంధించింది.ఏప్రిల్ నెలలో కరాచీలోని లాంధీ, మాలీర్ జైళ్ల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం 250 మంది భారత జాలర్లను..మూడు విడతలుగా భారత్‌కు అప్పజెప్పింది. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను భారత్ కు అప్పగించటం వంటి పలు కీలక పరిణామాల నేపధ్యంలో పాకిస్థాన్ భారత్‌తో శాంతిని ఆకాంక్షిస్తూ ఏప్రిల్‌లో 360 మంది భారత జాలర్లను నాలుగు విడతలుగా విడుదల చేయనున్నట్టు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది . ఇక తాజాగా మరోమారు 34 మంది జాలర్లను అరెస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *