ఆ ట్రక్కులో 39 మంది మృతదేహాలు..

39 dead bodies in the truck

భారీ ట్రక్కులో 39 మృతదేహాలు లండన్ నగరంలో సంచలనం రేపాయి. లండన్ దగ్గరలోని గ్రేస్ ఇండస్ట్రియల్ పార్కులో ఓ భారీ ట్రక్కు మెల్లగా ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్నిపోలీసులు తనిఖీ చేశారు. ట్రక్కు ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులకు అందులో 39 మంది మృతదేహాలను చూసి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. బల్గేరియా నుంచి ఈ ట్రక్కు వస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక వాహనంలో ఓ టీనేజర్ తో బాటు 39 మంది పెద్దల శవాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ వాహనాన్ని నడుపుతున్న 25 ఏళ్ళ ఐర్లండ్ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మృత దేహాలకు, ఇతడికి ఏ సంబంధం ఉందా అన్న కోణంలో లండన్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బహుశా ఈ యువకుడే వీరిని హతమార్చాడా అన్న విషయం తేలలేదు. ఇంతమంది తమ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పోలీసు చీఫ్ ఏండ్రు అన్నారు. అసలు వీరిని హత్య చేసింది ఎవరు? ఈ ట్రక్కులో వీరి మృతదేహాలను ఎక్కడికి తీసుకు వెళుతున్నారు? ఇంతమందిని హతమార్చడానికి గల కారణమేంటి? హతమార్చింది ట్రక్కును డ్రైవ్ చేస్తున్న యువకుడేనా ? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై అటు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇది చాలా షాకింగ్ ఘటన అంటూ మృతదేహాల వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. 2014 లో గ్రేస్ దగ్గరి ట్రైబరీ కంటెయినర్ పోర్టు వద్ద షిపింగ్ వాహనంలోనుంచి కొంతమంది కేకలు వినిపించడం, లోపల చూస్తే 34 మంది ఆఫ్ఘన్ సిక్కులు శ్వాస ఆడక, డీహైడ్రేషన్ తో బాధ పడుతూ కనిపించారని, ఒకప్పుడు జరిగిన సంఘటన ఈ సందర్భంగా పోలీసులు గుర్తు చేశారు. ఏది ఏమైనా భారీ ట్రక్కులు 39 మంది మృతదేహాలు గుట్టలుగా పడి ఉండటం అందరినీ షాక్ కి గురి చేసింది.

tags : london, truck , 39 dead bodies, vehicle checking, balgeria ,grace industrial park

మరో కేసులో బుక్ అయిన చింతమనేని

విలీనంపై వెనక్కు తగ్గమన్న ఆర్టీసీ కార్మిక జేఏసి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *