3D ఫేస్ మాస్క్

21
3D Facemask To Fight Corona
3D Facemask To Fight Corona

3D Facemask To Fight Corona

హైదరాబాద్లోని దుందిగల్ కి చెందిన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు కరోనా వ్యాధి నియత్రణ చర్యలలో భాగంగా 3D టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన ఫేస్ మాస్క్ లను మంత్రి కేటీఆర్  అభినందించారు. టీఆరెఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెటు ఇంచార్జి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ 3D ఫేస్ మాస్క్ ల ను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ.. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వినూత్న ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందించారు.. రాష్ట్రం లో కరోనా వ్యాధి విస్తరించకుండా తీసుకొనే చర్యలలో భాగంగా ఫేస్ మాస్క్ లు ఎంతగానో ఉపయోగ పడతాయని,ఆ దిశగా త్వరోలోనే నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఉపయోగించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

కోవిడ్ 19, నివారణ కొరకు మర్రి లక్ష్మణ్ రెడ్డి విద్యాసంస్థల ఇంక్యూబేషన్ సెంటర్ ద్వారా 3D లేజర్ టెక్నాలజీతో తయారు చేసిన యువీ (అల్ట్రావయొలెట్ డిసినిఫెక్షన్) ట్రాలీని రూపొందించి కేటీఆర్ కి  అందచేశారు. ఈ సందర్భంగా ఈ పరికారం ద్వారా మన చుట్టూ ఉన్న వాతావరణంలోని కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా మరియు బ్యాక్టీరియా RNA అభివృద్ధి చెందకుండా పూర్తిగా నాశనం చేస్తాయని వారికి వివరించారు. ఈ పరికరాలు ఇంటి పరిసరాలు, ఆసుపత్రిల గదుల్లో దీనిని వాడేలా తయారు చేశారు. ఈ విన్నూత ఆవిష్కరణను వాడుకలో తీసుకుంటామని మర్రి రాజశేఖర్ రెడ్డి  బృందంను కేటీఆర్ ప్రశంసించారు.

* గతంలో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు తమ కళాశాల అధ్యాపకుల పర్యవేక్షణలో సమాజానికి ఉపయోగపడే విధంగా పలు ఆవిష్కరణలు చేశారని మర్రి రాజశేఖర్ రెడ్డి వివరించారు. అందులో ముఖ్యంగా రైతులు తమ ట్రాక్టర్ల చోరిని నివారించడానికి” ఆటోమాటిక్ తెఫ్టు డిటెక్షన్ ఈక్విప్మెంట్టు” తయారు చేసి రైతాంగానికి మేలు చేశారని తెలిపారు. దీనిని ప్రముఖ ట్రాక్టర్ తయారీ దిగ్గజం జాన్ డీర్ తమ ట్రాక్టర్ల తయారీలో వినియోగించే విధంగా పలు చర్యలు తీసుకున్నారని చెప్పారు. అంద విద్యార్థుల సౌకర్యార్థం voice to pen potter రూపొందించారని తెలిపారు. రైతులు తమ పంటను క్రిమి కీటకాలు సోకకుండా పలు పురుగు మందులు వాడుతుంటారు వాటిని పిచికారీ చేయడం చాలా కష్టం తో కూడుకున్న పని.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ కళాశాల విద్యార్థులు అధునాతన సాంకేతిక పరజ్ఞానంతో పరికరాన్ని రూపొందించిన విషయాలను వివరించారు.

 

Telangana Innovations To Fight Corona

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here