పూరి ఆలయంలో 404 మందికి కరోనా

404 Members get corona positive in Puri temple

ఆధ్యాత్మిక క్షేత్రమైన పూరి ఆలయంలో 404 మందికి కరోనా సోకినట్లు సమాచారం. ఆలయంలో సేవకులుగా పనిచేస్తున్న 351 మందికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు, మరో 53 మంది సిబ్బంది కూడా వైరస్ బారిన పడినట్టు గుర్తించినట్లు ఆలయ యాజమాన్య నిర్వాహకుడు అజయ్ జెనా వెల్లడించారు. అయితే ఇంతమంది సేవకులు అందుబోటులో లేకపోయినప్పటికీ జగన్నాథ ఆలయంలో పూజా కార్యక్రమాలు యధాతథంగా జరుగుతాయని తెలిపారు. కరోనా కారణంగా మార్చి నెల నుంచి జగన్నాథ ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కాగా అనేక మంది సేవకులు కరోనా బారిన పడి హోం ఐసొలేషన్‌లో ఉన్న నేపథ్యంలో.. పూజాదికాలు నిర్వహించగల సేవకులకు తీవ్ర కొరత ఉందని ఆలయ యాజమాన్యం పేర్కొంది. ఇక నుంచి పకడ్బందీగా శానిటేషన్, ఇతర జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *