మియాపూర్లో ఐదంతస్తుల ఓనర్లకూ 10 వేలు?

4
5 floors owner gets 10K
5 floors owner gets 10K

5 floors owner gets 10K

ఎన్నికల సిత్రమంటే గిట్లనే ఉంటది. ఐదంతరాల బిల్డింగు ఉన్నోడికి పది వేలు పంచబట్టే. అదేమంటే.. వరద సాయమని అంటుండ్రు. గిది జూసి జనాలంతా పరేషాన్ అయితున్నరు. నెరీ ఎలచ్చన్లో గెల్చేందుకు గిట్ల ఎవ్వరికి బడితే వాళ్లకు ఇస్తరా? హైదరాబాద్లో ప్రతి వార్డుల గిట్లా పైసలు పంచుతుండ్రు. పేరుకేమో వరద సాయం. పంచుడు మాత్రం ఓట్ల కోసమే. మరీ గింత ఇజ్జత్ లేకుండా జేస్తే ఎట్ల?

మొన్నామధ్య వరదలు వచ్చినప్పుడు మియాపూర్లో ముప్పయ్, నలభై ఇండ్లకు నీళ్లు వచ్చినయ్. గప్పుడు ఎమ్మెల్యే గాంధీ ఒచ్చి వాళ్లకు పది వేలు  పంచిండు. అంతటితో ముచ్చట ఒడిచిపోయిందని అనుకున్నరంతా. గానీ, అక్కడే షురువైంది అస్సలు కథ. డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎలచ్ఛన్లు ఉండటంతో మియాపూర్ ఈ సేవా సెంటర్ పక్కన గల ఇస్కూలులో గిట్ల పది వేలు పంచుతుండ్రు. గిదే గా లైనంతా. ఇగ మీరే చెప్పుండ్రి. ప్రభుత్వ పథకం గిట్ల ఎలచ్ఛన్లలో గెల్చేందుకు ఇస్తరా?

ghmc elections 2020 latest