ఒక్కరోజే 879 కరోనా కేసులు

879 cases in telangana today

తెలంగాణలో ఇవాళ 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క రోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. 219 మంది ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం నమోదు అయిన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. ఇక హైదరాబాదులో ఈ ఒక్కరోజే  652 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 64 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అదేమిటో తెలియదు కానీ, ఒక్కసారిగా జనగామ జిల్లాలో 112 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి, రాష్ట్రం ఎటువైపు వెళుతుందనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇన్నాళ్లు కరోనా గురించి పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత కారణంగా.. ఒక్కసారిగా కేసులు నమోదు అవుతున్నాయి. అదే రెండు, మూడు నెలల క్రితమే ఈ తెలివి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నట్లయితే, ఇప్పటికే కేసుల తీవ్రత తగ్గిపోయి ఉండేది. ఏదీ ఏమైనా, రానున్న రోజులు తెలంగాణ ప్రజానీకానికి గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా, హైదరాబాద్లొ పరిస్థితి నానాటికి కేసులు పెరుగుతూ దిగజారిపోతున్నది.

Telangana Corona Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *