నీ దూకుడు.. సాటెవ్వరూ..

6
9 Years of Dookudu movie
9 Years of Dookudu movie

9 Years of Dookudu movie

‘నీ దూకుడు.. సాటెవ్వరూ…‘ అంటూ పోలీస్, ఎమ్మెల్యే పాత్రల్లో అదరగొట్టాడు మహేశ్ బాబు. ‘కళ్లున్నొడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ క్రేజీ డైలాగ్ లు,  అంటూ డైలాగ్స్, విలన్స్ మీద రివెంజ్ తీసుకునే సీన్స్, బళ్ళారి బాబు కామెడీ, పువ్వాయ్, దేత్తడి సాంగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా ప్రతిదీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ ఫెవరెట్ మూవీగా నిలిచింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన దూకుడు సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత దూకుడు పెంచి ట్రెండ్ సెట్ చేసింది ఈ మూవీ. ఇప్పటికీ దూకుడు పాటలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా మహేష్ కు హిట్ అల్బమ్ ఇవ్వాలని తన ట్యూన్స్ తో ఆకట్టుకున్నాడు.

2011లో సరిగ్గా ఇదే రోజున అంటే… సెప్టెంబర్ 23న దూకుడు  సినిమా విడుదలయ్యింది. ఈరోజుకు దూకుడు రిలీజై 9 సంవత్సరాలు అయిన సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల ఏమన్నారంటే… దూకుడు సినిమా సెట్ లో ప్రతి నిమిషం ఎంజయ్ చేసానని… తన కెరీర్ లో ఒక మైలురాయి లాంటి క్రేజీ మూవీ ఇచ్చారు అంటూ ఎమోషనల్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్వీట్ చేశాడు. దూకుడు సినిమా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దూకుడు హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.