చెట్టే కదా అని చూస్తే…9,500 జరిమానా

9500k fine for damaging Haritha Haram saplings

సిద్దిపేట పట్టణంలో  వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్క ను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో చెట్టు పడిపోయింది. దీనిని సమీపంలో ఉన్న పోలీసులు గమనించి హరితహారం అధికారి ఐలయ్యకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఐలయ్య వాహన దారుడు రాకేష్ కి తొమ్మిది వేల ఐదు వందల జరిమానా విధించారు.

హరితహారం లో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందే నని హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట ని హరిత సిద్దిపేట గా మార్చడమే ద్వేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.

హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ శాఖ ఉన్నత అధికారులు అందరికి , మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ల కు, మున్సిపల్ కమిషనర్ గారికి, డీ ఈ గారికి,
హరితహారం అధికారి సామల్ల ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

9500k Fine For Damaging Haritha Haram Saplings,Samal Ilaiah,Damaging Haritha Haram saplings,#SiddipetMunicipality,#TelanganaHarithaHaram, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *