దోస్త్ కటీఫ్ అంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

About Andhra Pradesh And telangana Chief Ministers
నిన్నమొన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మైత్రీ బంధం ముగిసినట్టే కనిపిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని, రెండు రాష్ట్రాల్లోనూ నదుల అనుసంధాన ప్రక్రియను సాగించి సాగునీటి తాగునీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని చర్చలు జరిపారు. ఇక అంతే కాదు ఒకరి కార్యక్రమాలకు ఒకరిని ఆహ్వానించుకుని తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు.
కానీ ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ రేపిన రచ్చ తెలంగాణ రాష్ట్రంలో నేటికీ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేలా చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణ సీఎం కెసిఆర్ కి తలనొప్పిగా మారింది. దీంతో ఏపీలో ఆర్టీసి విలీనం పై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అది అయినప్పుడు ముచ్చట అన్నట్లుగా మాట్లాడారు. ఆరు నెలల తర్వాత అదే అవుతుంది తెలుస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత నుండి నేటి వరకు ఇద్దరు సీఎంల మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య విభేదాలు కొట్టొచ్చినట్టు అర్థం అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమకు అభ్యంతరం లేదని కేసు ఉపసంహరించుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలోనూ అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని అన్నారు. కానీ ఏది చేయలేదు. కదా ఆంధ్రప్రదేశ్లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా విచక్షణారహితంగా తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించ వద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చెయ్యటం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చినట్లయింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను తూచ తప్పకుండా అమలు చేయాలని కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మైత్రి బంధానికి చెక్ పడినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య పంచాయతీ మళ్లీ మొదటికే వస్తుందా అన్నది తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

tags : andhra pradesh, telangana, y s jagan mohan reddy, kcr, friendship, gap, kaleshwaram project, national status, polavaram project, supreem court

టీడీపీకి జూ. ఎన్టీఆర్ ఎందుకు దూరమయ్యారు?

తెలంగాణలో సడక్ బంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *