పాఠశాల నుంచి లంచం?

7
ACB Trap School Education Officer
ACB Trap School Education Officer

ACB Trap school education superintendent

లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయంలోని ఇద్దరు అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఓ ప్రయివేటు పాఠశాల యాజమాన్యం నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లోని శాంటా మారియా స్కూల్‌ను స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్‌గా మార్చడానికి ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం యాజమాన్యం అనుమతి కోరింది. ఎన్వోసీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్‌లు 40 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో వారు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ప్లాన్ ప్రకారం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Telugu Live News