రాజధాని విషయంలో జయప్రద స్పందన ఇదే

Actress Jaya Prada opinion on AP Capital

ఏపీ రాజధాని విషయంలో  సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం సరైనది కాదని పేర్కొన్నారు సినీనటి, రాజకీయ నాయకురాలు జయప్రద . ప్రజల అభీష్టానుసారమే నిర్ణయాలు ఉండాలని సీనియర్ నటి జయప్రద అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఒక్కసారి అమరావతి రాజధాని అని చెప్పిన తరువాత, మళ్లీ మార్చడం సరికాదని అన్నారు. రాజధాని రైతుల పరిస్థితి దారుణం అని ఆమె అభిప్రాయపడ్డారు.  ఇక ఆమె మాట్లాడుతూ నేను ఉత్తరప్రదేశ్ లో ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి విషయాలు చూస్తూ ఉన్నాను. పాలసీస్ ప్రకారం, ప్రజల ఆలోచన ప్రకారం, వారి ఇష్టం ప్రకారం మనం చేయాలి. ఎందుకంటే, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. సో… మనం ఎన్నో ఖర్చులు పెట్టి, బయటి నుంచి వచ్చిన ఫండ్స్… ప్రజలు కూడా దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజల సుఖాన్ని చూసి నిర్ణయాలు తీసుకోవాలి” అన్నారు.తనకు రాజకీయాలు, సినిమాలు రెండూ జీవితంలో సంతృప్తిని ఇచ్చాయని అన్నారు. తన జీవితమంతా ఏదో ఒకరకంగా ప్రజలతోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనకు ఎటువంటి లక్ష్యాలూ లేవని, అయితే, ప్రజలకు చేయాల్సింది మాత్రం చాలా ఉందని అనుకుంటున్నానని అన్నారు. గతంలో ఆమె ఏపీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించారు కానీ మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకున్నారు. రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకున్తేనే ఫలితం ఉంటుందని జయప్రద చెప్పారు.

Actress Jaya Prada opinion on AP Capital,andhra pradesh,jayapradha, capital amaravati. three capitals, cm jagan mohan reddy, decision, not correct,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *