‘రంగస్థలం’లో పోటీ చేస్తే ‘పుష్ప’లో గెలిపిస్తున్నాడా..?

5
adi pinisetty in pushpa
adi pinisetty in pushpa

adi pinisetty in pushpa

సుకుమార్ సినిమాల్లోని అన్ని పాత్రలకు దాదాపు ఏదో ఒక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని చాలామంది ఆర్టిస్టులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక రంగస్థలం సినిమాలో అయితే ప్రతి చిన్న క్యారెక్టర్ కూ ఎలివేషన్ ఉంది. గుర్తింపూ వచ్చింది. అలాంటి సుక్కూ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య -2 తర్వాత ‘పుష్ప’అంటూ మూడో సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా అనేక బాలారిష్టాలు ఫేస్ చేస్తోన్న పుష్పలో కూడా చాలా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లర్ల నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తున్నాడని మొదటేచెప్పారు. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి రంగస్థలం వాస్తవ్యుడైన చిట్టిబాబు అన్న కుమార్ బాబుకు కూడా ఓ కీలక పాత్ర ఆఫర్ చేశాడు సుకుమార్ అనేది కొత్త వార్త.

అయితే ఈ మూవీలో కుమార్ బాబు అలియాస్ ఆది పినిశెట్టి పాత్ర గురించి తెలిస్తే ఇది కావాలని చేశాడా లేక కో ఇన్సిడెంటా అనే అనుమానం రాక మానదు. ఇంతకీ పుష్ప సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర గురించి వినిపిస్తున్నది ఏంటంటే.. అతను ఈ సినిమాలో గ్రామ సర్పంచి పాత్రలో కనిపిస్తాడట. పైగా అల్లు అర్జున్ కు అన్న కూడానట. అలా విలేజ్ పాలిటిక్స్ టచ్ ఇస్తూ మరోసారి రంగస్థలంను గుర్తు చేస్తోన్న సుకుమార్ మాత్రం ఆదికి ఆ పాత్ర ఇవ్వడం ద్వారా రంగస్థలంలో జరగనిది ఇక్కడ జరిగేలా చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి సర్పంచ్ పదవికి పోటీ చేస్తాడు. కానీ ఎన్నికలకు ముందే హత్య చేయబడతాడు. కానీ ఈ మూవీలో మాత్రం సర్పంచ్ గా గెలుస్తాడన్నమాట. మరి ఇది కాకతాళీయమా.. లేక కథ ప్రకారమేనా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా అప్పుడు పోటీ చేస్తే సుకుమార్ ఇప్పుడు గెలిపించడం అనేది కూడా భలే గమ్మత్తుగా ఉంది కదూ.

tollywood news