ఆదిలాబాద్ జిల్లాలో పులుల భయం

Adilabad create disturbances in fear of tigress

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది .  కొమ్రం భీం, మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లోని గ్రామాల్లో  ప్రజలను పులులు వణికిస్తున్నాయి.పులి భయం ఇక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది . గ్రామాల పరిసరాల్లో పులులు సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తుండడంతో.. పనులకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పెన్‌గంగా, ప్రాణహిత నదుల పరీవాహ ప్రాంతం పులుల ఆవాసానికి అనువుగా ఉండడంతో.. వాటి సంచారం పెరిగిపోయింది. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పెద్దపులి  తాంసి(కే) గ్రామంలో మూడు పశువులపై దాడి చేసింది . గత రెండు వారాలుగా గ్రామ శివారులో పులి సంచరిస్తున్న పులి..మేతకు వెళ్లిన పశువులపై వరుసగా దాడి చేసింది. పులి భయంతో పంట చేలకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పులి విషయంలో అటవీశాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి కోసం నిన్నటి నుంచి 200 మంది స్థానికులు గాలిస్తున్నామని కానీ ఎవరూ తమ గోడు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు అంటున్నారు . పులి నుంచి తమను కాపాడాలని లేకుంటే గ్రామాన్ని వేరే చోటుకి తరలించాలని వారు కోరుతున్నారు.

Adilabad create disturbances in fear of tigress,adilabad, tigers, attack, cattle , people , tension , komuram bheem , manchiryal 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *