10 వేల కోట్లను చెల్లించిన ఎయిర్ టెల్

Airtel to pay AGR dues of Rs 10,000 cr
ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చిన నేపధ్యంలో ఎయిర్ టెల్ దీనిపై స్పందించి 10 వేల కోట్లను చెల్లించింది . ప్రైవేటు టెలికాం సంస్థల వద్ద నుండి బకాయిలు వసూలు చేయని కేంద్ర ప్రభుత్వానికి  సుప్రీం మొట్టికాయలు వేసిన నేపధ్యంలో కేంద్రం నోటీసులు జారీ చేసింది . టెలికాం కంపెనీలు సర్దుబాటు స్థూల ఆదాయం (ఎజిఆర్‌) బకాయిలను ఖజానాకు చెల్లించాల్సిందేనని సుప్రీంకోరు స్పష్టం చేసింది. ప్రముఖ మొబైల్ సంస్థ భారతీ ఎయిర్ టెల్ కేంద్రానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల్లో రూ. 10 వేల కోట్లను చెల్లించింది. స్వీయ మదింపు తరువాత మిగతా బకాయిలను చెల్లిస్తామని పేర్కొంది. బకాయిల చెల్లింపునకు డెడ్ లైన్ దాటిపోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే టెలికం సంస్థలను మందలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ సంస్థ భారతీ ఎయిర్ టెల్, భారతీ హెక్సాకామ్, టెలినార్ తరఫున ఈ డబ్బులు చెల్లించామని, సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరిగేలోగా మిగతా బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.  భారతీ ఎయిర్ టెల్ మొత్తం రూ. 35,586 కోట్ల బకాయి ఉన్నట్టు తెలుస్తోంది.ఇక దీనిలో 10 వేల కోట్లను చెల్లించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *