జయప్రద అనార్కలీ అన్న ఆజం ఖాన్ కొడుకు ..జయప్రద ఫైర్

Ajam Commented Jayapradha as “Anarkhali”

ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఆజంఖాన్ కు నోటి దురుసు ఎక్కువన్న సంగతి తెలిసిందే. కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జయప్రదపై కూడా ఇటీవల దారుణ వ్యాఖ్యలు చేశారు. ఖాకీ డ్రాయర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఇక ఆయన కుమారుడు అబ్దుల్లా కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నట్టున్నాడు. పాన్ దరేబా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, జయప్రదపై పరోక్ష విమర్శలు చేశాడు. తమకు అలీ, భజరంగబలీలు కావాలి కాని… అనార్కలి వద్దంటూ వ్యాఖ్యానించాడు. జయప్రదను అనార్కలీ అంటూ సంబోధించాడు .

దీంతో జయప్రద తనను ‘అనార్కలి’గా అభివర్ణించిన ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాపై మండిపడ్డారు. అబ్దుల్లా వ్యాఖ్యల పట్ల నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. తండ్రికి తగ్గట్టే కొడుకు కూడా ఉన్నాడని దుయ్యబట్టారు. విద్యావంతుడైన అబ్దుల్లా ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ‘మీ నాన్న నన్ను ఆమ్రపాలి అంటారు. నీవు నన్ను అనార్కలి అంటున్నావు. సమాజంలో ఉన్న మహిళలను మీరు చూసే విధానం ఇదేనా?’ అని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున జయప్రద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై ఎస్పీ నేత ఆజంఖాన్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *