Ajay Puvvada Got Corona
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా అని తేలింది. నిన్న చేసిన RTPCR పరీక్షల్లో COVID పాజిటివ్ అని తేలింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. మరి, ఆయనతో పాటు తిరిగినవారంతా హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందే.
తనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని మంత్రి తెలిపారు. అతన్ని కలిసిన వారు, ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దయచేసి COVID పరీక్ష చేసుకోవాలని మనవి చేశారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో హోం ఐసోలాషన్ లో ఉన్నానని తెలిపారు. అందరి ప్రేమే తనకు అసలైన వైద్యమని.. దయచేసి తనకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించవద్దని అజయ్ పువ్వాడ తెలిపారు. తన హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తానని.. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.