హిట్ కాంబో.. అఖిల్ కు హిట్టెక్కిస్తుందా..?

5
akhil movie
akhil movie

akhil movie update

ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఫోర్ గ్రౌండ్ లో టాలెంట్ లేకపోతే అస్సలే కుదరదు అని ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది వారస హీరోల వల్ల ప్రూవ్ అయింది. ఆ లిస్ట్ లోకి ఇతను కూడా వెళతాడు అని ఫస్ట్, సెకండ్, థర్డ్ మూవీ వరకూ అనిపించుకున్న కుర్రాడు అక్కినేని అఖిల్. ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన నాగేశ్వరరావు మనవడుగా, తర్వాత తరంలో ఇండస్ట్రీలోని టాఫ్ ఫోర్ లో ఒకడైన నాగార్జున తనయుడుగా వచ్చినా.. తనకు లేని టాలెంట్ ను వారసత్వం అందించదు. అందుకే వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ మూడు సినిమాల కథలనూ కొత్తగానే ట్రై చేశారు. బట్ రిజల్ట్ మారలేదు. చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా కనిపించే అతన్ని వందమందిని ఒంటి చేత్తో కొట్టించే వినాయక్ చేతిలో పెట్టడమే నాగార్జున చేసిన ఫస్ట్ మిస్టేక్. ఆ తర్వాత మనంతో మన ఫ్యామిలీని మెప్పించాడని ఫామ్ లో లేని విక్రమ్ చేతిలో పెట్టాడు. ఫోన్ నంబర్ కథను చాలా సిల్లీగా చెప్పాడతను. అటుపై నాగ్ .. తన ఇమేజ్ ను కొడుక్కి ఆపాదించి.. ప్లే బాయ్ లా చూపిస్తాడని మరో దర్శకుడి చేతిలో పెట్టాడు. ఇది ఇంకా పెద్ద ఫ్లాప్ అనిపించుకుంది.

మొత్తంగా ఇప్పుడు ఆల్రెడీ ఫేడవుట్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ తో పూజాహెగ్డే హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా కూడా అఖిల్ ఫేట్ ను మార్చడం అసాధ్యం అని చాలాకాలంగా వినిపిస్తోంది. అందుకే ఓ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేశాడు నాగార్జున. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అని ఆ మధ్య వినిపించింది. కానీ మధ్యలో అతను పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో ఇక అఖిల్ సినిమా అటకెక్కినట్టే అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కు ముందు పవన్ ఇంకా మూడు సినిమాలు చేయాల్సి ఉంది. ఆ గ్యాప్ లో అఖిల్ సినిమా చేయొచ్చు అనుకున్నారు. అందుకే సడెన్ గా ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈచిత్రానికి కథ వక్కంతం వంశీ అందిస్తున్నాడు. సురేందర్, వంశీ కాంబోలో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్స్ ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి అఖిల్ కే కాదు.. వరుస ఫ్లాపులు చూస్తోన్న నిర్మాణ సంస్థను సైతం గట్టెక్కించాల్సిన బాధ్యత తీసుకున్నారు. మరి ఈ హిట్ కాంబో ఆ పనిచేస్తుందా లేదా అనేది చూడాలి.

tollywood news