అంతా కలిసి అఖిల్ ను భయపెట్టారా..?

3
akhil movie
akhil movie

akhil movie

అక్కినేని అఖిల్.. ఒక్క హిట్ కోసం కొన్నాళ్ల క్రితం తారకరత్నలా చూస్తున్నాడు. అలాగని ఇతనూ అతన్లా కనుమరుగవుతాడు అని చెప్పడం లేదు. కానీ అప్పట్లో తారకరత్న కూడా ఇలాగే ఓ హిట్ కోసం ఎన్నోసినిమాల వరకూ ఎదురుచూశాడు. కట్ చేస్తే అది రాలేదు. అతనూ ఇంక రాలేదు. కానీ అఖిల్ విషయంలో అలా జరగదనే చెప్పొచ్చు. అందుకు కారణం అన్నపూర్ణ బ్యానర్. నాగార్జున బ్యాక్ ఎండ్. మొత్తంగా ఇప్పటి వరకూ చేసిన మూడు సినిమాలూ మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమా చేస్తున్నాడు. క్రేజ్ పెంచడానికి పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ మూవీని కొన్నాళ్ల క్రితం కనుమరుగైన ఆరెంజ్ మూవీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్నాడు.
సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ మూవీ అన్ని సినమాల్లానే కరోనా వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ షూట్ చేస్తున్నారు.

పూజాహెగ్డే కూడా ఈ షూట్ లో జాయిన్ అయింది. కొన్నాళ్ల క్రితం ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల  చేస్తాం అని చెప్పారు. కానీ  ఇప్పుడు డేట్ మారింది. అలాగని ముందుకు రాలేదు. ఇంకా వెనక్కి వెళ్లిపోయింది. యస్.. సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, కెజీఎఫ్ వంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. అందుకే కుర్రాడు భయపడ్డట్టు ఉన్నాడు. అందుకే జనవరి 21న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ డేట్ అయితే ప్రస్తుతానికి ఫిక్స్ అయింది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. మొత్తంగా పెద్ద సినిమాల మధ్య నలిగిపోతాడనుకున్నాడేమో అల్లు అరవింద్ కూడా సంక్రాంతి నుంచి తప్పుకున్నాడు. మరి ఈ బ్యాచులర్ అయినా అఖిల్ ను హిట్టెక్కిస్తుందేమో చూడాలి.

tollywood news