అబ్దుల్ కలామ్ పాత్రలో అలీ

ali in kalam role

కమెడియన్ గా బాలనటుడుగా మొదలై నాలుగు దశాబ్ధాల కెరీర్ ఉన్న నటుడు అలీ. కమెడియన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న టైమ్ లోనే అతను యమలీలతో హీరోగా బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇటు హాస్యనటుడుగా రాణిస్తూనే హీరోగానూ యాభై సినిమాలు చేశాడు. ఒక దశలో తెలుగులో టాప్ కమెడియన్ గానూ వెలిగాడు అలీ. అయితే కొన్నాళ్లుగా సరైన సినిమాలు పడటం లేదు. అయితే రొటీన్ కమెడియన్ వేషాలే వస్తున్నాయని అతనే వద్దనుకుంటున్నాడు అనేవారూ ఉన్నారు.  మొత్తంగా ఇప్పుడు సినిమాల్లో కంటే బుల్లితెరపై అలరిస్తున్నాడు అలీ. ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు మంచి రేటింగ్స్ ఉన్నాయి. ఆ కాలం నటీనటులను పరిచయం చేస్తూ వారితో తనకున్న అనుబంధాన్ని బట్టి షోను రక్తి కట్టిస్తోన్న అలీ.. ఇకపై సినిమాల్లో క్యారెక్టర్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.  అంటే కేవలం హాస్య నటుడుగా కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఓకే చెప్పాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా కూడా ఓ సినిమా చేసి ఉన్నాడిప్పుడు.  ‘మా గంగానది’అంత పవిత్రమైనది స్త్రీ.. అనే టైటిల్ తో రూపొందుతోన్న సినిమాలో సీరియస్ లాయర్ పాత్రలో నటించాడు అలీ. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమా విడుదల కావొచ్చు.

ఈ నేపథ్యంలో అతనికి ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. అది కూడా మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్ డాక్టర్ అబ్దుల్ కలామ్ బయోపిక్ లో కలామ్ గా నటిస్తున్నాడు. దనేటి జగదీష్ అనే వ్యక్తి డైరెక్ట్ చేయబోతోన్న ఈ సినిమాలో కలామ్ గా నటిస్తోన్న అలీ లుక్ ను కూడా విడుదల చేశారు. అబ్దుల్ కలామ్ లైఫ్ లోని కొన్ని కీలక ఘట్టాలను ప్రస్తావిస్తూ సాగే సినిమా ఇదంటున్నారు. మిస్సైల్ మేన్ గా గుర్తింపు తెచ్చుకుని.. ఆజన్మ బ్రహ్మచారిగా దేశానికి ఎన్నో సేవలు  చేసిన గొప్ప వ్యక్తిగా కీర్తి గడించారు కలామ్. అలాంటి వ్యక్తి బయోపిక్ లో మెయిన్ రోల్ కు హాస్య నటుడుగా ఇమేజ్ ఉన్న అలీని తీసుకోవడం కొంత ఆశ్చర్యమే అయినా.. అలీ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం మాకుంది అని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుందట. ఏదేమైనా అలీ.. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలవైపు రావడం విశేషమనే చెప్పాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *