హుజూర్ నగర్ ఉపఎన్నికపై అన్ని పార్టీల నజర్

Spread the love

ALL Political Parties Focused on Huzur Nagar Re election

తెలంగాణ లో‌ఎన్నికల‌ హడావిడి ఇంకా తగ్గలేదు . ఒక ఎన్నికలు ముగిసిన తర్వాత మరొక ఎన్నికలు వస్తున్నాయి. తాజాగా నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి‌ రాజీనామా‌‌ చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరి హుజూర్ నగర్‌లో‌ పోటీ చేసేది ఎవరు..ఈ ఎన్నికలు ఎవరికి అట్టం కడతాయి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
హుజుర్ నగర్ నియోజకవర్గం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి‌కి పట్టున‌్న నియోజకవర్గం. 2009లో హుజుర్ నగర్ నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే‌గా ఇక్కడ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఓడించేందుకు టిఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేసింది. స్థానికుడైన కెనడా ఎన్ఆర్ఐ శానంపూడి‌ సైదిరెడ్డి‌ని టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టినా అడతు ఓడిపోయాడు. పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోని హేమా హేమీలను ఎన్నికల బరిలో దింపారు. ఇందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ అభ్యర్థి‌గా ఫోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అయితే ఉత్తమ్ తర్వాత హుజుర్ నగర్ లో పాగా వేసేది ఎవరు అన్న చర్చ నడుస్తుంది. ఉత్తమ్ తో సమానంగా హుజుర్ నగర్ లో ఆయన సతీమణి పద్మావతి కి పూర్తి స్థాయి పరిచయాలు ఉన్నాయి. ఆమెకు టికెట్ ఇచ్చి హుజూర్ నగర్ నుంచి పోటీ చేయిస్తారని అంతా భావిస్తున్నారు. పద్మావతి కాకపోతే సూర్యాపేట కు చెందిన‌ పటేల్ రమేష్ రెడ్డి లేదా, జానారెడ్డి తనయుడు‌ రఘువీర్ రెడ్డిలను హుజూర్ నగర్ నుంచి పోటీ చేయించాలని టీ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఇక ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకునేందుకు టీఆర్ఎస్ గట్టి ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.

హుజూర్ నగర్ నుంచి కవితను పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆమెతో పోటీ చేయించడం కష్టమని భావిస్తున్నారు. ఇక గత ఎన్నికలలో ఉత్తమ్ పై స్వల్ప‌‌ మెజారిటీ‌తో ఓడిన శానంపూడి సైదిరెడ్డి‌నే మళ్లీ బరిలోకి దింపాలని టీఆర్ఎస్ చూస్తునట్లు సమాచారం. ఈ ఇద్దరూ కాకపోతే మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు సైతం గులాబీ పార్టీ పరిశీలిస్తునట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్..గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ‌మహాకూటమి‌కి మద్దతు తెలిపి‌ పోటీ చేయలేదు. హుజుర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇక బీజేపీ కూడా హుజూర్ నగర్ బరిలో దింపేందుకు రెడీ అవుతోంది. మొత్తంగా హుజుర్ నగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో అన్ని పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *