కొత్త కథలకు ‘నాంది’ పలుకుతున్నాడా..?

allari naresh new way

అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేశాడు. వరుస విజయాలతో కామెడీ హీరోగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే తండ్రి ఇవివి సత్యనారాయణ హఠాత్తుగా మరణించారో.. అప్పటి నుంచి( ఇది నిజం) నరేష్ కు విజయాలు మొహం చాటేశాయి. దీనికి తోడు టాలీవుడ్ లో కూడా ట్రెండ్ మారింది. రొటీన్ సినిమాలకు కాలం చెల్లింది. వైవిధ్యమైన కథలకు పట్టం కడుతున్నారు. నిజానికి ఈ తరహా డిఫరెంట్ ప్రయత్నాలు నరేష్ కూడా చేశాడు. ప్రాణం, నేను, గమ్యం, శంభో శివ శంభో వంటి సీరియస్ మూవీస్ తోనూ ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా మహర్షిలో మంచి పాత్ర చేశాడు. అయితే కామెడీ హీరోగా నరేష్ కు దాదాపు టైమ్ అయిపోయిందనే చెప్పాలి. కామెడీలో అన్ని కథలనూ ఇప్పటికే చేసి ఉన్నాడు నరేష్. అందుకే రూట్ మార్చాడు. వైవిధ్యమైన పాత్రలకు ‘నాంది’ పలుకుతున్నాడు. నరేష్ న్యూ మూవీ నాంది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మరో దర్శకుడు, రచయిత సతీష్ వేగేశ్న నిర్మించడం విశేషం. ఇంతకు ముందు విడుదల చేసిన నరేష్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

పోలీస్ స్టేషన్ లో నగ్నంగా వేళ్లాడదీసి ఉన్న స్టిల్ కు ప్రతి ఒక్కరూ స్పెల్ బౌండ్ అయ్యారు. లేటెస్ట్ గా ఈ మూవీలోని ఇతర కీలక పాత్రలను పరిచయం చేస్తూ మరికొన్ని స్టిల్స్ విడుదల చేశారు. నరేష్ తర్వాత అంత కీలకమైన పాత్రగా చెబుతోన్న ఆధ్య అనే పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు సంపత్ గా ప్రవీణ్, రాధా ప్రకాష్ గా ప్రియదర్శి, కిశోర్ గా హరీష్ ఉత్తమ్ నటిస్తున్నారు. ఈ స్టిల్స్ తో పాటు టైటిల్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేలా కనిపిస్తోంది. మొత్తంగా అల్లరోడి కెరీర్ కు కొత్త టర్న్ ఇచ్చేందుకు ఈ చిత్రం నాంది పలుకుతుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరి దశలో ఉంది. డబ్బింగ్ సైతం అయిపోయింది. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాతే విడుదల చేస్తారు అని సమాచారం. అంటే ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కాకుండా.. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వేచి చూస్తారట. మరి ఈ మూవీ అల్లరోడి కెరీర్ ను ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *