అల్లు అర్జున్ డియర్ కామ్రేడ్స్  అంటాడా..?

1
bunny helps pawan fans
bunny helps pawan fans

allu arjun new movie

అల్లు అర్జున్ కోసం కొత్త కథలుపుట్టుకు వస్తున్నాయిప్పుడు. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటాడు అల్లు అర్జున్. అందుకే వేదం, పరుగు, ఆర్య-2 వంటి సినిమాలు చేసి నటుడుగానూ సత్తా చాటాడీ స్టైలిష్ స్టార్. తన ఇమేజ్ కు పూర్తిభిన్నమైన సినిమాలు చేసినా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయడు అల్లు అర్జున్. అందుకే అతని సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాలూ సాధిస్తున్నాయి. అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టేసిన అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప’ చేయబోతున్నాడని తెలిసిందే. ఆర్య, ఆర్య-2 తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది. సుకుమార్ కూడా అటు రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తోన్న మూవీ కావడంతో పుష్పపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా ఉన్న ఈ టీమ్ కు కరోనా బ్రేక్ వేసింది. మొత్తంగా కరోనా ప్రాబ్లమ్ క్లియర్ అయ్యాక ఈ మూవీ రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతోంది. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమాకూ కమిట్ కాలేదు. కానీ రీసెంట్ గా కొరటాల శివ చెప్పిన కథ అతనికి బాగా నచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
భరత్ అనేనేను తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మొదలుపెట్టాడు. అందర్లానే వీరికీ కరోనా బ్రేక్ వేసింది.

మామూలుగానే ఆచార్య అనుకన్నదానికంటే చాలా ఆలస్యంగా మొదలైంది. మధ్యలో వచ్చిన అనుకోని ఉపద్రవంతో కొరటాలకు మరింత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో అతను ఓ మంచి కథ రాసుకున్నాడట. ఈ కథను అల్లు అర్జున్ ను కలిసి చెప్పాడు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి కదా. అది నిజమే అంటోంది ఫిల్మ్ నగర్. ఈ సినిమాలో హీరో ఓ పవర్ ఫుల్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపిస్తాడట. ఇలాంటి పాత్ర అల్లు అర్జున్ ఇప్పటి వరకూ చేయలేదు. పైగా కొరటాల మార్క్ కథనంలో ఖచ్చితంగా ఏదో ఒక సోషల్ ఇష్యూ ఉంటుంది కదా. అలా చూస్తే అల్లు అర్జున్ పాత్ర సందేశాత్మక స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు విజయ్ దేవరకొండ కూడా డియర్ కామ్రేడ్ అంటూ అలాంటి కథ ప్రయత్నించాడు. కానీ ఈ స్టోరీ లీడర్ ను కాక ప్రేమికుడిని తయారు చేసింది. అది కాస్తా గాడి తప్పి.. సినిమానే ఎటూ కాకుండా పోయింది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నించే స్టూడెంట్ యూనియన్ లీడర్ అంటే ఖచ్చితంగా వామపక్ష భావజాలమే ఉంటుంది. మరి అలాంటి కథకు అల్లు అర్జున్ ఒప్పుకుని డియర్ కామ్రేడ్స్ అంటాడా లేదా అనేది చూడాలి.

tollywood news