ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ ఆఫీస్ హైదరాబాద్లో

AMAZON WORLD LARGEST CAMPUS IN HYDERABAD

ప్రపంచం లో నే అమెజాన్ అతి పెద్ద కార్యాలయం హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. సీఎం కెసిఆర్ పరిశ్రమల అభివృద్ధికి తీసుకున్న ప్రోత్సాహ కరమైన నిర్ణయాల వల్ల అమెజాన్ ఈ రోజు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ఆరంభించింది. అమెజాన్ గురించి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. 2016 మార్చ్ ౩౦ న అమెజాన్ కార్యాలయం ప్రారంభించడానికి పునాది పడిందని కేటీఆర్ ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. అత్యంత వేగంగా నిర్మాణ పనులు జరుపుకుని ఈ రోజు, అనగా 2019 ఆగష్టు 21 న అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్ లో మొదలు కావడం తెలంగాణ కు గర్వ కారణమని చెప్పొచ్చు. నానక్ రామ్ గూడాలోని పది ఎకరాల స్థలంలో 15 అంతస్థుల అమెజాన్ భవనాన్ని మూడు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇందులో పార్కింగ్ కోసం దాదాపు లక్ష చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేశారు. ప్రస్తుతానికి ఈ భవనం లో ఏడు వేల మంది ఉద్యోగులకు సరిపోతుంది. సెప్టెంబర్ లో పు మరో రెండు వేల మంది అదనంగా ఇందులో పని చేసేలా అభివృద్ధి చేస్తారని తెలిసింది.

more news at tsnews.tv

బాబుపై సైరా పంచ్ లతో రెచ్చిపోయిన..

కేటీఆర్.. బీజేపీ ఉందో లేదో మీ చెల్లిని అడుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *