బాబును ఇమ్రాన్ తో పోల్చిన అంబటి

AMBATI ON BABU

వైఎస్సార్ సీపీ నేతల్లో కాస్త ఘాటుగా మాట్లాడటంలోనూ, సెటైర్లు వేయడంలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుంటారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై అంబటి వేసే సెటైర్లు మామూలుగా ఉండవు. తాజాగా బాబుపై ఆయన తన సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉంటే.. వరద తన కొంప ముంచడానికే వస్తోందని బాబు ఆందోళన చెందుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రాజెక్టుల దగ్గరకి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారని, కానీ చంద్రబాబు కుటుంబం మాత్రం బాధగా ఉందని విమర్శించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆయన నివాసం  అక్రమ కట్టడమని ప్రస్తుత పరిస్థితితో తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ‘‘వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయింది. ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదని సూచిస్తున్నాం. మీ క్షేమం కోసమే చెబుతున్నాం. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వ ఇంటి కోసం చంద్రబాబు కోరితే పరిశీలిస్తాం’’ అని రాంబాబు పేర్కొన్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *