నారానందయ్య శిష్యుల్లా తయారయ్యారా?

Spread the love

Ambati sensational Comments

ఏపీ అసెంబ్లీలో రసవత్తర చర్చ జరుగుతుంది. ఒకర్ని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అవమానం జరిగింది అన్న దానిపై జరిగిన చర్చలో అంబటి మాట్లాడుతూ టీడీపీ నేతలు పరమానందయ్య శిష్యుల తరహాలో నారానందయ్య శిష్యుల్లాగా తయారయ్యారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. దీంతో అసెంబ్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో అంబటి స్పందిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలను అవమానించాలని గానీ, అగౌరపరచాలన్న ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేయగానే టీడీపీ నేతలంతా..సుబ్బారావు గారు.. మీ లీడర్ కు అన్యాయం జరిగిపోయిందండీ.వెంకటరావు గారూ.. మీ లీడర్ ను అవమానించారు అండీ. నిద్రపోయేవారిని లేవగొట్టి మరీ చంద్రబాబుకు అన్యాయం జరిగింది అని చెప్పుకున్నారు. అసలు చంద్రబాబుకు అన్యాయం జరగలేదు. అవమానం జరగలేదు. మీరు పరమానందయ్య శిష్యులలాగా ప్రతీ చోట ఇలా చెప్పుకోవడం వల్లే ఆయనకు అవమానం జరిగింది అని చెప్పారు. దీంతో సభలో ఉన్న ముఖ్యమంత్రి జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుల్లో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *